చైనాలోని కెమికల్ ప్లాంటులో పేలుడు

blast in chemical plant
blast in chemical plant

చైనా: తూర్పు చైనా యాన్ చెంగ్ లో కెమికల్ ప్లాంటులో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడులో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఎరువులు తయారు చేసే ప్లాంటులో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పేలుడుతో మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

https://www.vaartha.com/news/international-news/
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: