ఆదాయం మూరెడు, వ్యయం బారెడు

శక్తికి మించిన సహకారం కానీ, సహా యం కానీ చివరకు కార్యక్రమాలు చేయడం అంత మంచిది కాదంటారు. మోయలేని భారం తలకెత్తుకుంటే అసలుకే మోసం వచ్చే విషయం ఎప్పుడూ విస్మరించకూడదు.ఏదో ఒకటి రెండు సందర్భాల్లో అయితే అర్థం చేసుకోవచ్చు. అభినం దించవచ్చు.

కానీ అదే పనిగా లక్ష్యంగా ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకోకుండా అందినకాడికి అప్పుతెచ్చి ఇష్టాను సారంగా వెచ్చిస్తుంటే అది వ్యక్తికి కానీ, సంస్థకు కానీ, ప్రభుత్వానికి కానీ ఒకనాటికి చేతులు ఎత్తకతప్పదు. ఇదేమి కొత్త విషయం కాదు. ఎన్నోసంస్థలు, వ్యక్తులు ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనావస్థకు చేరుకున్నఉదాహరణలు కోకొల్లలు. దివాలా కు సంకేతం ఆస్తులు అమ్ముకోవడం.అదొక దశ. అవి కూడా ఆవిరైపోయిన తర్వాత చివరి అంకం దివాలా. దివాలా అనేది వ్యక్తుల విషయంలో తీవ్రంగా సమాజం పరిగణిస్తుంది.

ఒకరకంగా సమాజ బహిష్కరణకు గురై నట్లే. దివాలా తీసిన వ్యక్తిని కానీ, కుటుంబాన్ని కానీ సమాజం ఎలా చూస్తుందో వేరే చెప్పక్కర్లేదు. అదే పరిస్థితి ఒక ప్రజాప్రభుత్వానికి ఏర్పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దేశంలో అనేక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రానురాను అగమ్యగోచరంగా తయారవ్ఞతున్నది. అప్పుల మీద అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఇలా ఎంతకాలం కొనసా గిస్తారు. ఆస్తులు ఆవిరైపోయిన తర్వాత అప్పుపుట్టని పరిస్థితి వస్తే ఏం చేస్తారు?

ఎంతకాలం పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తారు? అన్ని జవాబులు లేని ప్రశ్నలే. రాష్ట్రాల పరిస్థితేకాదు దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.ఆదాయవ్యయాలకు పొంతనలేకుండాపోతున్నది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు పుట్టుకరాకపోయినా గత రెండు దశాబ్దాల నుండి అప్పుల బాటలో పయనిస్తున్నాం.

దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు ఒక్కటే మార్గమని ఏనాటి నుంచో పెద్దలు చెప్తూనే ఉన్నారు. వాస్తవంగా చూస్తే దేశ ఆర్థిక పరిస్థితి పి.వి నరసింహారావ్ఞ ప్రధాన మంత్రి అయ్యేనాటికి దివాలా అంచునకు చేరుకున్నది. అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌ రిజర్వుబ్యాంకు దగ్గర ఉన్న బంగారం నిల్వలను విమానంలో లండన్‌కు తరలించి అక్కడ తాకట్టుపెట్టి నిధులు తెచ్చి అత్యవసర అప్పులు కట్టారు. ఏదేశానికైనా అంతకంటే అవమానకర పరిస్థితి ఉండక పోవచ్చు. అప్పటి నుంచి భారతదేశంలో ఆర్థిక సంస్కర ణల నామస్మరణ ప్రారంభమైంది.

సంస్కరణల మీద సంస్కరణలు చేస్తున్నారు. మరెన్నో చర్యలు చేపడుతు న్నారు. కానీ ఆ ఫలితాలు నేటికీ ప్రజలకు కన్పించడం లేదు. వాస్తవంగా ఆ సంస్కరణల ఫలితాలు ప్రజల అనుభవంలోకి రావడానికి ఇరవైఏళ్ల సమయం అవసరం లేదు.

మన దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు మారుమ్రో గుతున్నప్పుడే అమెరికా ఆర్థికవ్యవస్థ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. పెద్దపెద్ద ఆర్థికసంస్కరణలు కుప్పకూలి దివాలా తీశాయి.అప్పట్లో ఆ పరిస్థితిని అధిగమించేందుకు అమెరికన్‌ అధ్యక్షుడు సంస్కరణలు చేపట్టారు.స్వల్పకాలం లోనే వాటి ఫలితాలు వారికి కన్పించాయి. సంకటనంలో ఉన్న రంగాలకు ఉద్దీపన పథకాల అవసరం ముగిసిందని ఆనాడే ఫెడరల్‌ బ్యాంకు ప్రకటించింది. కానీ భారత్‌లో సంస్కరణలు ప్రారంభించి దాదాపు మూడు దశాబ్దాలు అయినా వాటి ఫలితాలు కనుచూపు మెరలో కన్పించడం లేదు.

ఇటీవల జిఎస్టీ, పాతనోట్లరద్దు లాంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్నాపరిస్థితిలో ఏమాత్రం మార్పురాకపోగా ఆర్థికమాంద్యం మరింత పెరిగింది.వాటి ప్రభావం రాష్ట్రా లపై కూడా పడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.అప్పులు పెరిగిపోతున్నా యి. వేలాది రూపాయలు వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారు.

ఇవి ఎలా ఎప్పుడు తీరుస్తారో? నిర్దిష్టమైన ప్రణాళి కలు ఉండటంలేదు. ఏదో కాగితాల మీదరాసుకొని బ్యాం కులకు విశ్వాసం కల్పించి కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికపరిస్థితి మరింత కలవర పరుస్తున్నది.దాదాపు నిర్మాణాత్మక పను లన్నీ ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవడంతో నెలలతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి పోయిన వేలాదిమంది కాంట్రాక్టర్లు ఆందోళ నకు సిద్ధమ వ్ఞతున్నారు. కొత్తపనులు ఏవీప్రారంభించే పరిస్థితి లేదు.

తెలంగాణాలో కూడాఅంతటి ఆర్థికసంక్షోభం లేకపోయి నా అభివృద్ధిపనులకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో జాప్యం జరుగుతున్నది.కొందరు కాంట్రాక్టర్లు తమసిబ్బం ది,సామాగ్రితో ఇతర రాష్ట్రాలకు తరలిపో తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోర్డులు కూడా పెట్టారు. మరొకపక్క రాబడులు తగ్గిపోతున్నాయి.ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి.

తెలంగాణకు సంబంధించి రాబడులు, వ్యయంమధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగిలిన నాలుగు నెలలు ముందుకు ఎలా వెళ్లాలి?పన్నుల వసూళ్లను ఎలా పెంచాలి? అనే అంశంపై ఆర్థికశాఖ పెద్దఎత్తునే కసరత్తు ప్రారంభించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనేఉన్నారు.

మన ది సంక్షేమ ప్రభుత్వమే.సంక్షేమ కార్యక్రమాలుచేపట్టాల్సిం దే. దారిద్య్రారేఖకు దిగువనున్న లక్షలాది మంది నిరుపేద బడుగు,బలహీనవర్గాలకు చేయూతనివ్వాల్సిందే. అందు లో మరోఅభిప్రాయానికి తావ్ఞలేదు. ఆర్థికవనరులు దృష్టి లో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా కార్యక్రమాలు ప్రకటిం చి నిధులు లేక చేతులు ఎత్తితే ప్రభుత్వ ప్రతిష్టకే మచ్చవస్తుందనే వాస్తవాన్ని పాలకులు విస్మరించరాదు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/investigation/