ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్‌దే!

అన్ని ఎగ్జిట్‌ సర్వేలు ఒకటే అంచనా

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో బిజెపి ఈసారి తన సీట్లను పెంచుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు సునాయాసమైన విజయం లభిస్తుందని చెప్పాయి. ముఖ్యమంత్రి అర్విం ద్ కేజ్రీవాల్ తన పీఠాన్ని నిలబెట్టుకుంటారని, ఆప్ కు 44, బిజెపికి 26 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఇప్సోస్ జరిపిన ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆప్‌కు 44 నుం చి 61స్థానాలు రావచ్చని, బిజెపికి 9 నుంచి 21 సీట్లు రావచ్చని రిపబ్లిక్ జన్ కి బాత్ సర్వే వెల్లడించింది. ఇక టీవీ 9 భారత్‌వర్ష్ సిసెరో అంచనా ప్రకారం ఆమ్ ఆద్మీకి 54, బిజెపికి 15, కాంగ్రెస్‌కు ఒక సీటు వచ్చే అవకాశం ఉంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు. ఈసారి ఆ పార్టీ పరిస్థితి కొంత మెరుగవుతుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2015 ఎన్నికల్లో ఆప్ అఖండ విజయం సాధించింది. అప్పుడు కేజ్రీవాల్ పార్టీ 67 స్థానాలు గెలుచుకోగా, బిజెపి కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 11వ తేదీన వెలువడనున్నాయి.

Delhi assembly Exit Polls 2020
Delhi assembly Exit Polls 2020

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/