సంయుక్త విజేతలు

ఎగ్జిబిషన్‌ బాక్సింగ్‌ పోటీ

Draw a match Tyson with Jones
Draw a match Tyson with Jones


లాస్‌ ఏంజిల్స్‌: మైక్‌ టైసన్‌, జోన్స్‌ జూనియర్‌ మధ్య శనివారం రాత్రి జరిగిన ఎగ్జిబిషన్‌ బాక్సింగ్‌ పోటీ డ్రాగా ముగిసింది.

దీనితో ఇరువురినీ విజేతలుగా ప్రకటించారు. చాలాకాలం తరువాత బరిలోకి దిగిన టైసన్‌లో ఏమాత్రం ఊపుతగ్గలేదు. ప్రత్యర్థిపై జోరుగా పంచ్‌లు విసురుతూ ఆరంభంలో ఆధిక్యం కనబరిచాడు.

51 ఏళ్ల టైసన్‌ చివరిసారిగా 15 సంవత్సరాల క్రితం ఐర్లాండ్‌కు చెందిన కెవిన్‌ మెక్‌బ్రైడ్‌తో పోటీపడి పరాజయం పొందాడు. ఆ పరాభవాన్ని పక్కనబెట్టి టైసన్‌ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. 51 ఏళ్ల రా§్‌ు జోన్స్‌కూడా టైసన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు.

ఎనిమిది రౌండ్లపాటు సాగిన ఈ పోరుకు అధికారిక రెఫరీలు లేరు. ప్రపంచ బాక్సింగ్‌ కౌన్సిల్‌ కేవలం ఇద్దరు జడ్జిలను నియమించింది.

పోటీ ముగిసేసరికి ఒక స్కోరు కార్డు టైసన్‌కు అనుకూలంగా పాయింట్లు కేటాయించగా, మరో స్కోరు కార్డు జోన్స్‌కు అనుకూలంగా పాయింట్లు కేటాయించింది.

కాగా మూడో స్కోరు కార్డు సమానంగా పాయింట్లు పంచడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించి ఇరువురినీ సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

పోరు ముగిసిన వెంటనే టైసన్‌,జోన్స్‌ ఒకరినొకరు అభినందించుకున్నారు.

ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ద్వారా వచ్చిన ప్రైజ్‌మనీని టైసన్‌ ఒక ఛారిటీ సంస్థకు ధారపోసి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/