నిర్భయ దోషులను ఉరి తీయడానికి వస్తున్న తలారి!

తలారి కావాలని తీహార్ అధికారుల లేఖ

All four convicts in Nirbhaya case
All four convicts in Nirbhaya case

న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు ఎట్టకేలకు తలారి దొరికాడు. తీహార్ జైలులో తలారి లేకపోవడంతో ఉరి తీయడానికి ఏర్పాట్లు చేసేందుకు తలారిని పంపాలని జైలు అధికారులు ఉత్తర ప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టరు జనరల్ ను కోరారు. దీంతో మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని తీహార్ జైలుకు తాత్కాలికంగా బదలీ చేశారు. గతంలో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలీని ఉరి తీసింది పవన్ కుమారే. ప్రొఫెషనల్ తలారిగా గుర్తింపు పొందాడు. ఏ మాత్రం నొప్పి తెలియకుండా దోషిని ఉరితీయడం, ఒక్క క్షణంలోపే ప్రాణం పోయేలా జాగ్రత్తలు తీసుకోవడంలో పవన్ అనుభవశాలి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/