అమెరికా మళ్లీ మరణశిక్షల అమలు!

ట్రంప్ సంచలన నిర్ణయం.

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా మళ్లీ దాదాపు 20 సంవత్సరాల తరువాత మరణశిక్షలను అమలు చేయనుంది. ఈ దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కిరాతకమైన నేరాలకు పాల్పడిన వారికి మరణదండన అమలు చేయాల్సిందేనన్న ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ప్రస్తుతం యూఎస్ లో ఐదుగురికి మరణశిక్ష విధించగా, వారికి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్న తేదీలను ఖరారు చేశారు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓ ప్రకటన చేశారు.
ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష అమలు చేయాలని న్యాయ శాఖ ఎప్పటి నుంచో కోరుతోందని గుర్తు చేశారు. అయితే అమెరికాలో పలు రాష్ట్రాలలో నేరస్థులకు విషపు (లెథల్) ఇంజక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేస్తారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/