ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు కొనసాగుతున్న కాల్పులు

security forces
security forces

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ షోసియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే జైనాపొర ప్రాంతంలోని ద్రగడ్‌ గ్రామ సమీపంలో ఉద్రవాదులు దాగి ఉన్నారన్నా సమాచారంతో భత్రతాబలగాలు తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఈరోజు వేకువజామున తారసపడ్డ ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా సిబ్బంది వాటిని దీటుగా తిప్పికొడుతున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు ముష్కరులు ఆ ప్రాంతంలో నక్కి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/