కరోనా తరుణంలో అధికంగా పనిగంటలు : ప్రాణాలకే ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

  • పని గంటలు అధికమైతే గుండె జబ్బులు
  • వారానికి 55 గంటలు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తే ఆరోగ్యానికి పెనుముప్పు
  • మృతుల్లో ఎక్కువ శాతం మధ్య వయసు పురుషులే
  • 72 శాతం మరణాలు పనిగంటల భారంతోనే
  • ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో బాధితులు అధికం
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ విభాగం డైరెక్టర్ మరియానైరా హెచ్చరిక
Excessive working hours in corona moment
Excessive working hours

Geneva: ప్రపంచవ్యాప్తంగా కరోనా తరుణంలో పనిగంటలు పెరిగాయని ఇది ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఉద్యోగులు, కార్మికుల పనిగంటలు పెరిగాయని, గుండెకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. సాధారణ పనిగంటల కంటే అధికంగా పనిచేయటం కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని పర్యావరణ, వాతావరణ మార్పులు, ఆరోగ్య విభా గం డైరెక్టర్‌ మారియా నైరా వెల్లడించారు.

194 దేశాల్లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ వో), డబ్ల్యూహెచ్‌వో సంయుక్త సర్వేలో. ఎక్కువ గంటలు పనిచేసేవారిలో గుండెపోటు మరణాలు పెరిగాయని తేలిందన్నారు.

వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేస్తే ఆరోగ్యానికి పెనుముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ విభాగం డైరెక్టర్ మరియానైరా హెచ్చరించారు. మరణించే ముప్పు 35 శాతం ఎక్కువని తెలిపారు.

2016లోనే ఈ కారణంగా సుమారు 7.45 లక్షల మంది గుండె పోటు సంబంధిత వ్యాధుల కారణంగా మృతిచెందారని పేర్కొన్నారు. తాజాగా ఈ ముప్పు మరింత పెరిగిందని.. ఎక్కువసేపు పనిచేసి మృతి చెందినవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని, పనిగంటల వల్ల 72శాతం మంది పురుషులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో వయస్కుల వారే అధికంగా ఉన్నారని తెలిపారు. ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు చైనా, జపాన్‌, ఆస్ట్రేలియాల్లో బాధితులు అధికంగా ఉన్నారని వెల్లడించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/