మాజీ సిఎంకు తీవ్ర అస్వస్థత

Harish-rawat
Harish-rawat

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ సిఎం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం తీవ్ర ఛాతినొప్పితో బాధపడడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కీలక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
రావత్‌ 2016-17 మధ్యలో సిఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అతేకాక ఆయనకు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/