అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమం

Arun Jaitley
Arun Jaitley

న్యూఢిల్లీ: మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. గత వారంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయనను పరామర్శించడానికి మరికాసేపట్లో ఎయిమ్స్ కు చేరుకోనున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి పై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితర ప్రముఖులు ఆరా తీశారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కాగా, 66 ఏళ్ల అరుణ్ జైట్లీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. అనారోగ్యం కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/