దేశం విడిచిపోకుండా మహింద రాజపక్స పై నిషేధం

మహింద రాజపక్స, ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు


కొలంబో: ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థితికి చేరిన నేపథ్యంలో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. కోర్టు నిషేధం విధించిన వారిలో రాజపక్స తనయుడితో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు కూడా ఉన్నారు.

రాజపక్సకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, రాజపక్సను, ఆయన అనుయాయులను అరెస్ట్ చేయాలన్న పిటిషనర్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే దేశంలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు వున్నాయని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/