మాజీ ఎంపీ వినోద్ కు కీలక పదవి

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ నియామకం
నిన్న ఉత్తర్వులను వెలువరించిన రాష్ట్ర ప్రభుత్వం

Vinod Kumar-cm kcr
Vinod Kumar-cm kcr

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీ వినోద్ కు ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ కీలక పదవిని కట్టబెట్టారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ… పార్టీకి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్ష పదవిలో ఆయనను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులను వెలువరించింది. ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికా సంఘానిది అత్యంత కీలకమైన పాత్ర. ఈ నేపథ్యంలో, అనుభవజ్ఞుడైన వినోద్ కు ఈ పదవిని అప్పగించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఉపాధ్యక్షుడి హోదాలో వినోద్ కు కేబినెట్ ర్యాంక్ ఉంటుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/