సీఎం జగన్‌ ఎదురైతే అభినందిస్తా..

jc diwakar reddy
jc diwakar reddy

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై మాజీ ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాలో మాట్లాడుతూ..సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు అని కితాబిచ్చారు. తాను చేయాలనుకున్నది చేసే నేత అని సీఎం జగన్‌ను అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. జగన్‌ ఆరునెలల పాలన చాలా బాగుందని పేర్కొన్నారు. జగన్‌ ఎదురైతే తప్పకుండా అభినందిస్తానని, ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు హయంలో కమ్మవాళ్లు గోదావరి, కృష్ణాలో కలిసిపోయారని, కానీ జగన్‌ ఎన్నో నామినేటెడ్‌ పోస్టులను రెడ్లకు ఇచ్చారని అందుకు తాను మెచ్చుకుంటున్నానని జేసీ తెలిపారు. చంద్రబాబుకు ఈ తరహా తెగువ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/