టీడీపీలో విషాదం : మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి

టీడీపీ పార్టీ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురికావడం తో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పటల్ కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణమూర్తి మృతితో కుటుంబం లో విషాదం నెలకొంది.

2014 లో టీడీపీ పార్టీ తరఫున పి.గన్నవరం నుంచి నారాయణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో టీడీపీ పార్టీ టికెట్ నిరాకరణించారు. దీంతో వైస్సార్సీపీకి మద్దతు ప్రకటించారు. ఇటీవల చంద్రబాబుని కలవడానికి ప్రయత్నించారు పులపర్తి. కానీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ను కలిసేందుకు నిరాకరించారు చంద్రబాబు. 1996 వరకు BSNL లో చిరుద్యోగిగా పనిచేస్తూనే , 1996 లో జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. 2004 లో టీడీపీ – బిజెపి పొత్తులో భాగంగా బిజెపి అభ్యర్థికి కేటాయించడం తో, స్వతంత్ర అభ్యర్థిగా గా నారాయణ మూర్తి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2014 లో పి. గన్నవరం నుండి టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. 2019 లో టికెట్ రాకపోవడం తో టీడీపీ వీడి , బిజెపి లో చేరి కొన్ని రోజులు కొనసాగారు.