చింతమనేనిని మరోసారి అరెస్టు


ఓ వ్యక్తిని నిర్బంధించి కొట్టారంటూ అభియోగాలు

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar

దెందులూరు: టిడిపి నేత, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటీవలే దళితులను దూషించిన కేసులో అరెస్టటయిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే, 2018లో పెదవేగిలో మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి దాడిచేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు చింతమనేనిని ఎక్సైజ్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఈ మాజీ ఎమ్మెల్యేకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే అనేక కేసుల్లో రిమాండ్ ఎదుర్కొంటున్న చింతమనేనిని తాజా కేసు మరిన్ని చిక్కుల్లో పడేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/