జనసేనకు చిరంజీవి అభిమానులు సపోర్ట్ చేయాలని నాగబాబు బ్లాక్ మెయిల్ – వెల్లంపల్లి

జనసేన పార్టీ నేత , మెగా బ్రదర్ నాగబాబు ఫై వైస్సార్సీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేనకు చిరంజీవి అభిమానులు సపోర్ట్ చేయాలని నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఆరోపించారు. గత మూడు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ కార్యకర్తల్లో కొత్త ఉత్సహం నింపుతున్న సంగతి తెలిసిందే. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అలాగే వైస్సార్సీపీ సర్కార్ ఫై విమర్శలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో నాగబాబు ఫై వెల్లంపల్లి శ్రీనివాస్ పలు ఆరోపణలు చేసారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని, చిరంజీవి లేకుంటే పవన్ కల్యాణ్ ఎవరికి తెలిసేవాడని ప్రశ్నించారు.

ఇక నాగబాబుకు ఒక విధి, విధానం అంటూ లేవని విమర్శించారు. చిరంజీవి అభిమానులను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. జనసేనకు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయాలని నాగబాబు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా పవన్ ఎలాంటి వాడో తెలుసని చెప్పారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుంటూ బీజేపీతో పవన్ టచ్ లో ఉన్నారని విమర్శించారు. అసలు పవన్ ను బీజేపీ వాళ్లు పట్టించుకోవడం లేదని వెల్లంపల్లి విమర్శలు చేశారు.