శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

సాదర స్వాగతం పలికిన టీటీడీ అధికారులు

శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు
atchannaidu-visits-tirumala

తిరుమల: మాజీ మంత్రి అచ్చెన్నాయడు ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అచ్చెన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అచ్చెన్నకు అందజేశారు. కాగా ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్న ఐదు రోజుల క్రితం బెయిలుపై విడుదలయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/