రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం బిపి డౌన్ కావడం తో వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు స్టార్ హాస్పటల్ కు తరలించారు కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. మరికాసేపట్లో ఆయన పార్థివదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. రోశయ్య మరణ వార్త విని రాజకీయ నేతలు స్టార్ హాస్పటల్ కు తరలివెళ్తున్నారు.

ఇక రేపు మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరపనున్నారు. ఉదయం 11 : 30 గంటలకు ఆయన పార్థివదేహాన్ని గాంధీ భవన్ కు తరలించి అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. 12 :30 కు ఆలా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం కు అంతిమయాత్ర చేపట్టి…ఒంటిగంట ఆ సమయంలో ఆయన అంత్యక్రియలు జరపబోతున్నారు.

1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ చదివారు. స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడుగా.. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య.. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం.