జగిత్యాలలో ఈవీఎంల తరలింపుపై కలకలం

evms
evms

జగిత్యాల: జగిత్యాలలో సోమవారం (నిన్న) రాత్రి ఆటోలో ఈవీఎంల తరలింపు సంఘన కలకలం రేపుతుంది. జగిత్యాల తహసీల్దారు కార్యాలయం నుండి మినీ స్టేడియం ఉన్న గోదాంకు ఆటోలో 10 ఈవీఎంలను అర్థరాత్రి తరలించారు. అయితే ఇవి గ్రామల్లో అవగాహన కోసం చూపిన పాత ఈవీఎంలంటూ జగిత్యాల ఆర్డీవో తెలిపారు. పాత స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకువెళుతున్నామని వివరణ ఇచ్చారు. ఈవీఎంల తరలింపు కలకలం రేపడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా, కోరుట్ల ఈ రెండు నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.ఈ రెండు సంఘటనలపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తీవ్రంగా పరగిణించి విచారణ జరుపుతున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/