ఈవీఎంలను సరిచేశాం..ప్రశాతంగా పోలింగ్‌

GOPALKRISHNA DWIVEDI
GOPALKRISHNA DWIVEDI

విజయవాడ: రాష్ట్రంలో ఈవీఎంలలోని లోపాలను సరిచేశామని ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. దీంతోఒ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈవీఎంలు ధ్వంసమైన చోట కొత్తవి పెట్టామని, 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని ఆయన తెలిపారు. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతుందనేవి వదంతులేనని ఆయన కొట్టిపారేశారు. 80శాతం పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని సీఈవో చెప్పారు. ఎన్నికల నిర్వహణలో తాము విఫలమయ్యాయనేది అవాస్తవమన్నారు. 0.30 శాతానికంటే తక్కువగానే ఈవీఎంలు మొరాయించాయని ద్వివేది తెలిపారు. 6 గంటలలోపు క్యూలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తామన్నారు. పోలింగ్‌ సమయం పొడిగించాల్సిన అవసరం లేదన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/