అమేథిలో ఈవిఎంల మొరాయింపు

polling
polling

లక్నో: దేశంలో నేడు ఐదో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఉత్తరప్రదేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు పోలింగ్‌ బూత్‌లలో ఈవిఎంలు మొరాయించాయి. దీంతో ఓటు వేయటానికి వచ్చిన ఓటర్లు ఎన్నికల ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సిబ్బందిని ఆయా బూత్‌లకు పంపి ఈవిఎంలను సరిచేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/