అన్నీ తెరిచారు.. బడులు తెరవరా?

విద్యాసంవత్సరానికి తీరని నష్టం

School Children -File
School Children -File

ఈ కరోనా కష్టకాలంలో ఎక్కువ నష్టం జరిగింది అంటే అది విద్యకే. పిల్లల విద్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అన్ని తెరిచారు.

పండుగ సీజన్‌ నడు స్తున్న కారణంగా వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు షాపింగ్‌ మాల్స్‌ నడుస్తున్నాయి.

అన్ని మతాలకు సంబంధించిన సంస్థలు గుడి, చర్చి, మసీదులు ప్రతి ఒకటి తెలిచారు. కానీ బడులు మాత్రం తెరవలేదు.

దేశంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఎలక్షన్లు హడావ్ఞడి రాజకీయ నాయకుల పదవులు అన్ని వచ్చాయి. కానీ పిల్లలకు విద్య మాత్రం దొరకడం లేదు.

అందరం ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రం దేశంలో అన్ని బహి రంగ సభలో ఎన్నికల ప్రచారాలు వందల మంది వేల మంది గుమిగూడితే వారికి కరోనా రాదా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

తూతూ మంత్రంగా ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశపెట్టినా కానీ అందరికీ అందని విద్యనే అయింది. పేదవారికి పిల్లలకు ఇంట్లో టీవీ, ఫొన్‌లు లేని పిల్లలు కూడా ఉన్నారు.

ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు, ఉచితంగా పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నది.కానీ రేపటి భవిష్యత్తు పిల్లలకు విద్యకు ఉపయోగపడే టివీ కానీ ఫొన్లు, ట్యాబ్‌, లాప్‌టాప్‌ ఏదైనా ఒకటి ప్రభుత్వం ఆలోచించి పంపిణీ ఎందుకు చేయ లేదు?

పిల్లలకు ఓటు హక్కు లేదనా? కొన్ని గ్రామాలలో చాలావరకు టీవీలు, గుడిసెలలో ఉన్నవారికి ఇలాంటి సదు పాయాలు లేవు.

వారు ఎలా విద్యను పొందాలి. సంవత్సరం నుండి ఇంటికే పరిమితమైన విద్యార్థులను ఎవరు ఆదుకోవాలి? వారి సమస్యలు పట్టవా?

సంవత్సరం నుండి బడులకు విద్యకు పట్టే నిధులతో విద్యార్థులకు అందరికీ ఉచితంగా లాప్‌టాప్‌లు ఇవ్వాలి.

ప్రభుత్వాలు ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం బడి నుండి వస్తుంది. కాబట్టి విద్య అందరికీ అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కొన్ని అటవీ ప్రాంతాలలో ఉన్న గ్రామాలలో యువత చైతన్యమై దాతల ద్వారా నగదు సేకరించి టివీలు, ఫోన్లు, లాప్‌టాప్‌లు విరాళంగా ఇచ్చారు.

కానీ ప్రభుత్వాలు మాత్రం ఆన్‌లైన్‌ విద్యను ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంది.

కానీ అందరికీ ఆన్‌లైన్‌ విద్య అందుతుందా అనే ఆలోచన చేయాలి.

అంగన్‌వాడి పిల్లల నుండి యూనివర్శిటీ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ వరకు అందరికీ ఉచితంగా ట్యాబ్‌, లాప్‌టాప్‌, ఫోన్‌ ఏదో ఒకటి ప్రభుత్వం ఆలోచించి ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇవ్వాలి.

ఇది ప్రభుత్వానికి భారం కాదు. అన్ని విద్యాసంస్థలు మూసివేసిన నాటి నుంచి బడిలో, కళాశాలలు, యూనివర్శిటీలలో హాస్టళ్లలో విద్యార్థుల కోసం వెచ్చించే నిధులు మిగిలాయి.

మధ్యాహ్న భోజనం ఖర్చులు సంవత్సరం నుంచి మిగిలాయి.

కొన్ని యూనివర్శిటీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ హాస్టళ్లను తెరవలేదు. విద్యార్థులు ఎక్కడ ఉండి పరీక్షలు రాయాలి.

పల్లెల నుండికష్టపడి యూనివర్శిటీల మెట్లు ఎక్కితే పరీక్షలు మాత్రమే నిర్వహించి హాస్టల్‌ తెరవకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలిగి స్తున్నాయి.

అధిక మొత్తంలో చెల్లించి వసతిగృహంలో ఉండి పరీక్షలురాయాల్సి వస్తోంది. కాబట్టి యూనివర్శిటీ హాస్టళ్లను ప్రభుత్వం తెరవాలి.అప్పుడే పరీక్షలు నిర్వహించాలి.

దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో బహిరంగ సభలు, ర్యాలీల్లో మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు.

అందరికీ లేని కరోనా నిబంధనలు విద్యావ్యవస్థపై ఎందుకు కఠినంగా అమలులో ఉంది.ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి విద్యను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలి.

విద్యార్థులు సంవ త్సరం నుండి ఇంటికే పరిమితమై మానసికంగా, అన్నిరకాలుగా ఒత్తిడికి లోనవుతూ జీవిస్తున్నారు.

చదివిన చదువును మరిచి పోయే పరిస్థితులు రావచ్చు.చిన్న పిల్లలపై దీని ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. విద్యకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి.

ప్రతి విద్యార్థికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

  • ముచ్కుర్‌ సుమన్‌ గౌడ్‌

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/