ఆ చిత్రం పూర్తయ్యేదాకా శాఖాహారమే

Actress Nayanatara

లేడీ సూపర్ స్టార్ నయనతార .. సౌత్ ఇండియా మొత్తం యమ క్రేజ్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వరుసగా చేస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక భక్తిరస చిత్రాన్ని చేస్తోంది. ‘ముకుతి అమ్మన్’ అనే టైటిల్ తో తమిళంలో రూపొందుతున్న చిత్రంలో నయనతార కన్యాకుమారి అమ్మ వారిగా కనిపించబోతుందట. ఈ చిత్రం కోసం నయనతార చాలా దీక్షగా ఉంటుందట.
కన్యాకుమారి అమ్మవారి పాత్రను పోషించేందుకు గాను నయనతార శాఖాహారిగా మారిపోయిందట. షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రతి రోజు కూడా శాఖాహారమే తినబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఒక పూట భోజనంను కూడా ఆమె వదిలేసినట్లుగా తెలుస్తోంది. అమ్మవారిపై పూర్తి భక్తి తో ఈ సినిమాను చేయాలని ఆమె భావిస్తోంది. నయనతార తాను ఏ పని చేసినా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి  చేస్తుంది. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యింది. 

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/