ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

మంత్రి జగదీశ్‌ రెడ్డి

jagadish reddy
jagadeesh reddy

నల్లగొండ: జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, బత్తాయి ఎగుమతులపై అధికారలతో మంత్రి జగదీశ్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు ఉమ్మడి నల్గోండ జిల్లాలో రికార్డు స్థాయిలో దాన్యం దిగుబడులు వచ్చాయని, అన్నారు. అందుకు అనుగూనంగా గన్ని బ్యాగ్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్నాన్ని కూడా కొనుగోలు చేస్తామని,రైతులు ఆందోళన చెందవద్దని , రైతును రాజును చేసిన ఘనత సిఎంకే దక్కుతుందని అన్నారు. ఇక సూర్యాపేటలో కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. గత ఆరు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/