అయోధ్యపై బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు


రాముడు అయోధ్యలోనే పుట్టాడన్న విషయం ప్రపంచానికి తెలుసు

Baba Ramdev
Baba Ramdev

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న విషయం ముస్లింలతోపాటు ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అయోధ్య వివాదం ముగింపు దశకు వచ్చేసినట్టేనని, ఇక రామ మందిరాన్ని నిర్మించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ.. మోదీ, షాలు ఇద్దరూ కలిసి ఒకే దేశంఒకే రాజ్యాంగంఒకే జెండాగ కలను నెరవేర్చారని, సర్దార్ పటేల్ తర్వాత ఈ పని చేసింది వారేనని కొనియాడారు. ఈ ఒక్క నిర్ణయంతో కేంద్రంపై ప్రజల విశ్వాసం పెరిగిందన్నారు. ప్రస్తుతం చాలా దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయని, మోదీ ఈ సంక్షోభాన్ని సమర్థంగా పరిష్కరిస్తారని బాబా రాందేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/