కరోనా కొన్నేళ్ల పాటు కొనసాగుతుంది..

వ్యాక్సిన్‌ వచ్చినా కరోనా పోదు..అమెరికా వైద్య నిపుణులు

corona vaccine

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌పై అమెరికాకు చెందిన వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి కొన్నేళ్ల పాటు ఉంటుందని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక, హెచ్‌ఐవీ, తట్టు, అమ్మవారు వంటి వ్యాధుల్లా కరోనా కూడా మానవులను పీడిస్తూనే ఉండే అవకాశాలూ లేకపోలేదని చెప్పారు. ఇప్పటికే కరోనా జాతికి చెందిన నాలుగు వైరస్‌ల వల్ల మనుషులకి సాధారణ జలుబు వంటివి వస్తున్నాయని, కరోనా ఈ జాబితాలో ఐదోదిగా చేరే అవకాశం ఉందని చెప్పారు. కరోనాతో సురక్షితంగా ఎలా సహజీవనం చేయగలమనేదే ముఖ్యమని షికాగో విశ్వవిద్యాలయ వైద్య నిపుణుడు సారా కోబె తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని విధాలుగా స్థిరంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/