కరోనా వైరస్ పై అప్రమత్తంగానే ఉన్నాం
స్వైన్ ఫ్లూ తరహాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

హైదరాబాద్: కరోనా వైరస్ చైనాతో పాటు అనేక దేశాలకు కలవరం కలిగిస్తోంది. భారత్ లోనూ ఈ ప్రాణాంతక వైరస్ పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడం ఆపేయాలని స్పష్టం చేశారు. గతంలో స్వైన్ ఫ్లూ విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అప్రమత్తంగానే ఉన్నామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని సూచించారు. ఆయన తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటిండెంట్ శంకర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కరోనా వైరస్ అంశంపై సమీక్ష జరిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/