రోజుకు 50 వేలకు తగ్గకుండా కరోనా పరీక్షలను నిర్వహించండి

ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహించాలని ఆదేశం..ఈటల ఆదేశం

హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రతి రోజు కనీసం 50 వేలకు తగ్గకుండా కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన వర్చువల్ విధానం ద్వారా సమీక్ష నిర్వహించారు.

కరోనా టెస్టింగులను పెంచాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించి, కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/