భూక‌బ్జా వాస్తవమే: మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ వెల్లడి

అచ్చంపేట‌లో విచార‌ణ వేగవంతం

District officials conducting an investigation with CM orders
District officials conducting an investigation with CM orders

Medak district : రాష్ట్ర మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ భూముల క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని ఆరోపణలు వాస్తవమేనని మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిష్ పేర్కొన్నారు. సి ఏం కెసిఆర్ ఆదేశాల‌తో విజిలెన్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు శనివారం ఉద‌యం అచ్చంపేట‌లో విచార‌ణ ప్రారంభించారు. సీఎం కు ఫిర్యాదు చేసిన రైతుల‌తో అధికారులు మాట్లాడారు. భూముల‌ను కూడా అధికారులు ప‌రిశీలించారు. అసైన్డ్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు గుర్తించారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ హ‌రీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. భూక‌బ్జా వాస్తవమే అని అన్నారు. స‌ర్వే అనంత‌ర‌మే ఎంత భూమి క‌బ్జాకు గురైంద‌నే విష‌యం తేలుతుంద‌ని చెప్పారు.. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట, ధరిపల్లి గ్రామాలకు చెందిన రైతులు అన్యాయానికి గురయ్యారని , వారు తమ భూములు లాగేసుకున్నారని బాధిత రైతులు వాపోయారని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/