నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈటల

హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మెదటిసారి ఆయన బీజేపీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. నేటి ఉదయం 10.30 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఈటలకు బండి సంజయ్, తరుణ్ చుగ్ తదితరులు ఘన స్వాగతం పలకనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల నేరుగా హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్లారు. ఈటల రాక నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా అభిమానులు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/