‘ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు జగన్‌ సర్కారు’

‘నోబెల్‌’ గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ఎస్తర్‌ డఫ్లో ప్రశంస

Nobel laureate, MIT Professor Esther Duflo meets with CM Jagan Mohan Reddy at the CM’s camp office in Tadepalli on Monday

Tadepalli: ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు ఏపీలోని వైయస్‌ జగన్‌ సర్కారు అడుగులు వేస్తోందని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్‌ ఎస్తర్‌ డఫ్లో అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంతో తాము క‌లిసి చేస్తామ‌ని వెల్ల‌డించారు. సోమవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ తో ఎస్తర్‌ డఫ్లో బృందం భేటీ అయింది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎస్తర్‌ డఫ్లో బృందానికి సీఎం జగన్ వివరించారు. అనంతరం ఎస్తర్‌ డఫ్లో మాట్లాడారు.

సీఎం జగన్ తన పాదయాత్రలో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అర్థంచేసుకుని ప్రభుత్వ పథకాలన్నీ రూపొందించరని అన్నారు. కేవలం ఒక గదిలో కూర్చుని పథకాలకు ఆయన రూపకల్పన చేయలేదు. అలా చేస్తే అవి కేవలం థియరిటికల్‌గా ఉంటాయన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు ఎవ్వరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ ఆయన గొప్ప ఆలోచనా దృక్పథాన్ని వెల్లడిస్తోందని అన్నారు. అంతేకాకుండా, పేదరికాన్ని నిర్మూలించాలనే సీఎం అంకితభావాన్ని వెల్లడిస్తోందని అన్నారు.

Nobel laureate, MIT Professor Esther Duflo meets with CM Jagan Mohan Reddy at the CM’s camp office in Tadepalli on Monday-

డీబీటీ పథకాల్లో అధికభాగం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వేయడం, అలాగే గృహనిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కేవలం మహిళా సాధికారికతకే కాదు.. దీనివల్ల అన్నిరకాలుగా కుటుంబం సుస్థిరమవుతుంది అన్నారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై స్టడీ చేసి, సలహాలు కోరడం అనేది కూడా సీఎంగా ఆయనకున్న దార్శినికతకు నిరద్శనం గా చెప్పారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి సీఎం పథకాలు పెట్టారు కాబట్టి… ఏం చేయాలన్నా , దానిపై మేం పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని, అయితె క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. వాటి బలోపేతం కోసం సలహాలు సూచనలు అందిస్తామని ఎస్తర్‌ డఫ్లో తెలియజేసారు.

వీడియో బైట్‌లో ఎస్తర్‌ డఫ్లో ప్రస్తావించిన అంశాలు:

  • ముఖ్యమంత్రితో నిర్మాణాత్మకంగా చాలా చక్కటి సమావేశం జరిగింది.
  • ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం.
  • ముఖ్యమంత్రి తోపాటు, అయనతో కలిసి పనిచేస్తున్న అధికారుల బృందాన్ని కూడా కలుసుకున్నాం.
  • వివిధ అంశాలపై భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడంపైనా మేం దృష్టిపెడుతున్నాం.
  • పేదల అభ్యున్నతికోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం వివరించారు.
  • వారి కనీస అవసరాలను తీర్చడానికి, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం, చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పారు.
  • తన స్వీయ అనుభవాలనుకూడా సీఎం మాతో పంచుకున్నారు.
  • పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచడమనే లక్ష్యసాధనలో వారితో కలిసి పనిచేస్తాం:
  • రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి
  • వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కున్న పరిజ్ఞానం మమ్మల్ని ఆకట్టుకుంది. ఆయనకున్న అంకిత భావం కూడా ఆకట్టుకుంది
  • గడచిన 15 ఏళ్లుగా వివిధరంగాల్లో జె–పాల్‌ పనిచేస్తోంది. 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్‌ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నాం.
AP Chief Secretary Sameer Sharma explaining government welfare schemes to the Esther Duflo team

ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలకు సంబంధించిన వివరాలను సీఎస్‌ సమీర్‌ శర్మ తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎస్ వివరించారు.

ఈ సమావేశంలో ఎస్తర్‌ డఫ్లోతో పాటు ఆమె బృంద సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్‌ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్‌ శర్మతో పాటు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/