ఈటలకు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి

Etela Rajender-errabelli

వరంగల్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మంగళవారం వరంగల్‌లో కలిశారు. ఈసందర్భంగా ఈటలకు దయాకర్‌రావు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మంత్రి దయాకర్‌రావు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఈటల రాజేందర్‌ను అభినందిస్తూ పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇద్దరు మంత్రులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ, చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/