బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆగ్రహం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని , కేసీఆర్‌ను చూస్తే బీజేపీ నేతల వెన్నులో వణుకుపుడుతున్నదని, కేసీఆర్‌ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదని ఎర్రబెల్లి అన్నారు. చండూరులో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు డబ్బు మదంతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓట్లు వేయాలన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక పోరు బిజెపి – టిఆర్ఎస్ మధ్య కొనసాగుతుంది. ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ప్రతి గడప తొక్కుతూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు చండూరులో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మునుగోడుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు డబ్బు మదంతో మునుగోడు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీకి ఓట్లడిగే హక్కు లేదని మంత్రి చెప్పారు.