వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువే

ఆందోళన పెంచుతున్న డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యలు

Dr. Mike Ryan

జెనీవా: కరోనా మహమ్మారి నియంత్రణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ పూర్తిగా అంతం చేసే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించే అవకాశం తక్కువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా రెండోసారి అది చెలరేగకుండా చేయొచ్చని పేర్కొన్నారు. అలా చేస్తే లాక్‌డౌన్‌ల నుంచి కూడా ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1.2 కోట్లను దాటేయగా, 5,59,481 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 68 లక్షల మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. మరోవైపు, భారత్‌లోనూ ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/