60 ఏళ్లకు పెరగనున్న ఈపీఎఫ్ పింఛన్ వయోపరిమితి

ప్రస్తుతం 58 ఏళ్లకు పింఛన్

EPF
EPF

న్యూఢిల్లీ: ఈపీఎఫ్ పెన్షన్ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 58 ఏళ్లు నిండిన వారిని లబ్ధిదారులుగా పరిగణిస్తుండగా, ఇకపై రెండేళ్లు పెంచి 60 ఏళ్ల నుంచి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాదు, 60 ఏళ్ల తర్వాత పింఛన్ తీసుకునేవారికి అదనంగా కొంత బోనస్ కూడా ఇవ్వాలని యోచిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్‌వో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టనుంది. అక్కడ కనుక గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. ఇక 60 నుంచే పింఛన్ లభించనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/