పర్యావరణ పరిరక్షణ అత్యవసరం : కేసీఆర్
తెలంగాణ ప్రజలకు సీఎం పిలుపు

Hyderabad: పర్యావరణ పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా స్వచ్ఛమైన ప్రాణవాయువును అధిగమించగలమని అన్నారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదని అన్నారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణను విధిస్తూ గ్రీన్ కవర్ పెంచే హరితహారం వంటి పలు పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీ జలాలను మల్లించడం ద్వారా అడుగడుగునా పచ్చదనం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను సాధించామన్నారు. తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/