మట్టి తవ్వకాలతో పర్యావరణానికి ప్రమాదం

Mafia
Mafia

రా ష్ట్రవ్యాప్తంగా డాంబర్‌ ప్లాంట్లు, స్టోన్‌ క్రషర్ల నిర్వహణ, మట్టి దందా దేనికి సంకేతం? నిబంధనలు పాటించకున్నా కనీస చర్యలుచేపట్టని సంబంధిత శాఖాధి పతులు తీరు దేనిని సూచిస్తుంది. కాలుష్యాన్ని చిమ్ముతూ, సహజవనరులను విధ్వంసం చేస్తూ లాభార్జనే ధ్యేయంగా చెరువ్ఞలు, కుంటలు, ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు దేనిని వదలకుండా యధేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టడం లాంటి చర్యలు అభివృద్ధి కోసమా? మనుగడను ప్రశ్నార్థకం చేయడానికా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మను షుల భవిష్యత్‌ కోసం అభివృద్ధి కావాలా? మనుషుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసే అభివృద్ధిని సృష్టించాలా? నేడు అభివృద్ధి గురించి మాట్లాడే వారు ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసకర చర్యల ను పసిగట్టాల్సిన సమయమిది. మనిషి భవిష్యత్‌కు ముప్పు తెచ్చే అభివృద్ధిని ఎందుకని, ఎవరి కోసమని అంటూ ప్రశ్నిం చుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతిని ఛిద్రం చేసే చర్యలు మనిషి మను గడను ప్రశ్నార్థకం చేయకతప్పదని గుర్తించాలి. ప్రకృతి సమ తుల్యతను కాపాడకుంటే వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు మనిషి మనుగడనే పెను ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అలాంటి కీలకమైన ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలు స్వలా భాపేక్షతో యధేచ్ఛగా జరుగుతున్నాయనడంలో సందేహం లేదు.స్టోన్‌ క్రషర్లు,క్వారీల నిర్వహణల్లో జరిపే బోర్‌ బ్లాస్టింగ్‌ల వల్ల కూడా ప్రకృతిలో అనేక మార్పులు సంభవించడానికి కారణమవ్ఞతున్నాయి. కొన్ని క్వారీలు, స్టోన్‌క్రషర్ల బోర్‌ బ్లాస్టిం గ్‌లను యధేచ్ఛగా నిర్వహించే తీరు పరిశీలిస్తే అధికారులు, పాలకులు, లాభాపేక్ష కలిగిన వ్యక్తుల పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. అడ్డూఅదుపులేకుండా వందల ఫీట్ల వరకు బోర్‌ బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. బోర్‌ బ్లాస్టింగ్‌ల వల్ల సంభవించే పరిణామాలను తక్కువ అంచనా వేయడమంటే భవిష్యత్‌ తరాల వినాశకర చర్యలు తప్ప మరొకటి కాదు.బోర్‌ బ్లాస్టిం గ్‌ల వల్ల శబ్దకాలుష్యం, అందులో వాడే పేలుడు పదార్థాల వల్ల వెలువడే వాయుకాలుష్యం, తద్వారా భూమి కాలుష్యం, వందల ఫీట్ల లోతు గుట్టల అడుగుభాగంలో తవ్వకాలు చేపట్ట డం ఫలితంగా భూగర్భజలాలు అడుగంటిపోవడం లాంటి తదితర వాటితో పర్యావరణం దెబ్బతింటుందని, ప్రకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయనేది కూడా పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మరువరాదు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లోని స్టోన్‌ క్రషర్లు, డాంబర్‌ ప్లాంట్లు, మట్టి తవ్వకాల వల్ల జరిగే ప్రమాదాల వల్ల భవిష్యత్‌ పరిణామాలను కూడా గుర్తెరగాలి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో యధేచ్ఛగా సాగు తున్న మట్టిమాఫియా, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న మట్టితవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

  • రాజేందర్‌ దామెర
    తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/