పర్యావరణ పరిరక్షణ సామాజిక భాద్యత

నిర్మల్: ఈరోజు ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, వర్షాలు తగ్గుతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక భాద్యతగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని వెల్లడించారు. దీంట్లో భాగంగానే తెలంగాణ సర్కార్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/