‘థాంక్యూ’ నుండి చక్కటి మెలోడీ సాంగ్ రిలీజ్

వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ , మారో మారో.. సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..ఈరోజు సినిమాలోని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఏంటో ఏంటేంటో.. అంటూ సాగే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోని గురువారం విడుదల చేశారు. తమన్ సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా జోనితా గాంధీ ఆలపించారు. మెలోడీ ప్రధానంగా సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మూడు దశల్లో సాగే హీరో జర్నీ నేపథ్యంలో ఈ ప్రేమకథని దర్శకుడు తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నాగచైతన్య ఇందులో హాకీ ప్లేయర్ గా సూపర్ స్టార్ మహేష్ వీరాభిమానిగా కనిపించబోతున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ మూవీపై భారీగానే అంచనాలు పెంచేసుకున్నారు. ఇక ఈ మూవీ లో రాశిఖన్నా , మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్ లుగా నటించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ జూలై 8న రిలీజ్ కి రెడీ అవుతోంది.

YouTube video