పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

rahul gandhi
rahul gandhi

ముంబై: పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీకి ముంబై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.15,000 పూచీకత్తుపై బెయిల్‌ వచ్చింది. మాజీ ఎంపి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌ షూరిటీ ఇచ్చారు. జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్య కేసులో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలే హత్యకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త పరువునష్టం దావా వేశారు.
బెయిల్‌ లభించిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..తనపై దాడి జరుగుతుందని, ఈ పోరాటాన్ని తాను ఎంజా§్‌ు చేస్తున్నట్లు , పేదలకు, రైతులకు అండగా తాను ఉంటానని తెలిపారు. తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమని స్పష్టం చేశారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos