అంతం కాని అణచివేత..

నేడు మహిళా దినోత్సవం సందర్భంగా కథనం

విత్తనం మొలకెత్తాలంటే క్షేత్రం కావాలి. అలాంటి క్షేత్రమే స్త్రీ. ప్రపంచంలో కొన్ని దేశాల్లో స్త్రీలను తక్కువగా చూస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు.

Women’s Day Special Story

చదువుల్లో, ఆటల్లో, సాంకేతికరంగంలో, వైద్యరంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా కూడా ఆయా రంగాల్లో స్త్రీలు ఉంటున్నారు.

ఒకప్పుడు వంటింటికే పరిమితమయిన స్త్రీ, బాల్యవివాహాలు, వితంతు వివాహారాలు ఇలా రకరకాలుగా బాధించబడిన స్త్రీ ఇప్పుడు నాగరిక మాజంలో అన్ని రంగాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నది.

ముఖ్యంగా రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. స్త్రీలకు రావలసిన 33 శాతం కోటా కొన్ని చోట్ల ఖచ్చితంగా అమలవుతున్నది. మరికొన్ని చోట్ల వాటి ఊసే లేదు. ఏ దేశానికి, ఏ జాతికి చెందిన స్త్రీలయినా అణచివేతకు గురవుతున్నారు.

ప్రపంచంలో ఎన్నో రకాల నాగరికతలు, వివిధ అంశాల పరిస్థితి ఎలా ఉన్నా స్త్రీ స్వేచ్ఛ మానత్వం, అత్యాచారాల విషయంలో అంతగా మార్పు రావటం లేదు. పురుషుల కంటే స్త్రీలను తక్కువగా చేసి చూడటం, నిరాదరన కనబరచటం కూడా స్త్రీల హక్కుల్ని ఉల్లంఘించటమే అవుతుంది. ఈ ఉల్లంఘన ప్రపంచవ్యాప్తంగా మహిళల ఎదుగుదలకు దెబ్బతీస్తు వస్తోంది.

ప్రపంచంమంతా అన్ని రంగాల్లో అతివేగంగా ముందుకు దూసుకుపోతున్నా సమానత్వంలో కొంత మార్పు కనిపిస్తున్నది.

సమూలమయిన మార్పు కోసం కృషి చేయాల్సిన అవసరముంది. అయితే మహిళలు ఉద్యమాలు చేసేది తాము పురుషులకంటె పై స్థాయిలో ఉండాలని మాత్రం కాదు, కేవలం సమానంగా ఉండాలనే. ఇలా చేస్తే కనుక సమాజంలో స్త్రీ స్థానం మారుతుంది.

సామాజిక, శారీరక అంశాల్లో స్త్రీలకు, పురుషులకు తేడాలున్నా చట్టం ముందు అందరూ సమానులే. అయితే మహిళాసాధికారత లభిస్తే కనుక సమాజమంతా లాభపడుతుంది. వారి కుటుంబాలు, పిల్లలు, సమాజంలోని ప్రజలు ప్రయోజనం పొందుతారు.

అన్ని రంగాల్లో ఉత్పాదకత, చైతన్యం పెరుగుతుంది. అయితే భారతదేశంలో మాత్రం స్త్రీని భారతమాతగానే పిలుస్తూ మరొకవైపు స్త్రీని చులకనభావంతో చూస్తున్నారు. మహిళలను అణగదొక్కుతున్నారు.

మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయి. స్త్రీకి రక్షణ, స్వేచ్ఛ, సమానత్వం, గుర్తింపు కరువయ్యాయని చెప్పవచ్చు.

19,20 శతాబ్దాల్లో గృహహింసలకు, బాల్యవివాహాలకు బలయ్యారు. 20వ శతాబ్దం మొదటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణ కోసం,వారి సమస్యల పరిష్కారం కోసం ఎందరో మహిళలు ఉద్యమాలు చేసారు. సమాజంలో మహిళల స్థితిగతులు మెరుగుపడనిదే సామాజాకాభివృద్ధి సాధ్యం కాదు.

ఇంకా కొందరు మహిళల్లో ఎంత శక్తి సామర్ధ్యాలున్నా, తెలివితేటలున్నా పురుషులకంటె తక్కువ వేతనాలు పొందుతున్నారు. స్త్రీలు శారీరకంగా బలవంతులు కారని చెప్పి వారికి అవకాశాలే ఇవ్వని రంగాలు కొన్ని ఉన్నాయి.

మయన్మార్‌ దేశంలో అయితే ప్రజాస్వామ్యయుతమైన ఎన్నికల్లో ఒక మహిళ ఉద్యమనాయకురాలిగా గెలిచిన ఆమెకు అధికారం దక్కుకుండా రెండు దశాబ్దాలకు పైగా ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు.

ఇంతటి వివక్ష అయితే ఎక్కడా కనిపించదు. కొన్ని కొన్ని రంగాల్లో స్త్రీలు మగవాళ్లకంటె ఎక్కువ సమర్ధవంతంగా పనిచేస్తారని అంకితభావంతో పని చేస్తారని వాటిపై చేసిన అధ్యయనాల ద్వారా కూడా రుజువ్ఞ చేయబడినాయి.

సివిల్స్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇప్పుడు మహిళలే ఎక్కువగా ఉంటున్నారు.అయినప్పటికీ వాళ్ల హక్కులు హరించి వేయబడుతున్నాయి.

టెక్నాలజి ఎంతగా పెరిగినప్పటికీ ఆడపిల్లల భ్రూణహత్యలు కొనసాగుతుండడం విచారకరం. జనాభా గుణాత్మకంగా పరిణామం చెందాలంటే అక్షరాస్యత, విద్య రెండూ అవసరమే. మానవ వనరుల నాణ్యతకు, ఆర్ధికాభివృద్ధికి, మహిళాసాధికారతకు ఇదే కీలకం. ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది చెందుతున్న కొద్దీ నూతన నైపుణ్యాల ఆవశ్యకత పెరుగుతుంది.

ఈ దృష్ట్యా నైపుణ్యాలు హేతువ్ఞతో కూడిన విజ్ఞానం పెంపొందించే విద్య నేడు అవసరం. అప్పుడే స్త్రీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మహిళల్లో అక్షరాస్యత శాతం పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాలలో విద్యలో వెనుకబడే ఉన్నారు.

ఇంట్లో విద్యావంతుడుగా పురుషుడు ఉంటే అదే ఇంట్లో ఒక మహిళ విద్యావంతురాలయితే ఆమె తన కుటుంబాన్నికే కాక సమాజాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది. మహిళలు మునుపటి మాదిరిగా లేరు.

అన్ని రంగాల్లోను ఎదిగిపోతున్నారు. అటు విద్యారంగం అయితేనేమి, ఇటు రాజకీయరంగం అయితేనేమి ఇంకా చెప్పాలంటే విద్యారంగంలో అయితే మహిళలు పురుషులకన్నా వేగంగా సాగిపోతున్నారు.

ఇలా దినదినాభివృద్ధి చెందుతూ స్త్రీలు వంటింటికే పరిమితమన్న ముద్రను రూపుమాపి మగవారితో సమానంగా మున్ముందుకు సాగుతున్నారు. వారి జీవితాశయాలను సాధించుకుంటున్నారు.

అయినప్పటికీ కొన్ని ప్రాంతాలో స్త్రీలపై వివక్ష తొలగడం లేదు. హక్కుల విషయాల్లోగాని, ఉద్యోగాల్లో గాని, ఆస్తుల పంపకాల్లోగాని ఇప్పటికి పురుషాధిక్యతే చెల్లుబాటు అవుతోంది.

భారత ప్రభుత్వం మహిళా సాధికారత గురించి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. రాజకీయపరంగా కూడా మహిళా సాధికారత కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు.

అయినప్పటికీ ఇవన్నీ ప్రణాళికలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎంతో కొంత ప్రగతి, సాధికారత సాధించిన స్త్రీలే వీటివల్ల లాభం పొందుతున్నారు.

గ్రామీణ, అట్టడుగు స్థాయి మహిళలకు దక్కుతున్నది మాత్రం శూన్యం. తెల్లవారితే అఘాయిత్యాలు దినపత్రికల్లో, టివి ఛానళ్లలో, సోషలమీడియాల్లో వైరల్‌ అవుతున్నాయి.

ఎదుటి స్త్రీలలో మన కుటుంబ సభ్యులను చూడలేకపోతున్నాం. క్షణికావేశంతో యువత ఇలాంటి పాడు పనులు చేస్తూ వారి జీవితాన్ని బూడిదపాలు చేసుకుంటున్నారు. అలా చేయడం వల్ల బాధిత కుటుంబంతోపాటు యువకువల కుటుంబసభ్యులు కూడా ఎంతో నష్టపోవాల్సి వస్తోంది.

ఇలాంటి అఘాయిత్యాల బారిన పడి అమ్మాయిలు చనిపోతే వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుంది. ఆ పని చేసినందుకుగాను ఆ యువనులకు ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు పడి వారి కుటుంబాలు కూడా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. దీనంతటికి కారణం తల్లిదండ్రుల పెంపకం, వాతావరణం, నిరుద్యోగం, చెడు స్నేహం ఇవన్నీ కారణాలే.

తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచి చదివించినట్లయితే పిల్లలు కూడా మంచిగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని వారి జీవితానికి ఒక అర్ధం ఉండేవిధంగా తయారవుతారు.

కానీ కొందరు తల్లిదండ్రులు బీదరికం వల్ల వారితో పాటు (తల్లిదండ్రులతో) పనుల్లోకి తీసుకెళ్లడం వల్ల కాస్త పెద్దయ్యాక వారు సంపాదించుకుంటున్న డబ్బులతో బీడీలు, సిగరెట్లు, మద్యం, గంజాయిలాంటి మత్తు పదర్థాలకు బానిసలయి క్షణికావేశంలో ఏం చేస్తున్నారు.

తెలియని పరిస్థితిలో కూడా కొందరు దారుణాలు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో స్త్రీ ఉంటుంది. అది తల్లిరూపంలో, తోడబుట్టిన వారి రూపంలో, భార్య రూపంలో, పిల్లల రూపంలో ఉంటారు. సమాజంలోని స్త్రీలందరినీ, తల్లి, చెల్లి, అక్క, కూతురు ఇలా ఎందుకు అనుకోము. ఆకలి చూపులు ఎందుకు చూస్తారో అర్ధం కాదు.

స్త్రీకి ప్రతిచోట శత్రువులున్నారు. అమ్మాయిలు, ఉద్యోగులు చదువునే దగ్గర ఉద్యోగాలు చేసే కార్యాలయాల్లో చివరకు బంధువుల రూపంలో చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. యుపిలోని ఘజియాబాద్‌లో గర్భంతో ఉన్న స్త్రీ చనిపోతే ముగ్గురు మూర్ఖులు ఆమె శవాన్ని అనుభవిం చారు.

తెలంగాణాలోని వరంగల్‌ జిల్లాలోని హన్మకొండలో 10 నెలల పసికందును ఒక యువకుడు దారుణంగా హింసించి చంపాడు. 80 యేళ్ల వయసున వృద్ధులను కూడా వదిలిపెట్టడం లేదు. దీనికంతకి కారణం వారిని కన్నవారి పెంపకం సరిగా లేకపోవడం. మద్యానికి బానిసవ్వడం. ప్రస్తుతం ప్రపంచమంతా అన్ని రంగాల్లో అతివేగంగా దూసుకుపోతున్నది.

ఇప్పటికయినా పురుషాధిక్య ధోరణి మారాలి. ఇటీవలి కాలంలో కొంత సమానత్వం వచ్చిన మార్పు కనిపిస్తోంది.

సమూలమైన మార్పు కోసం కృషి చేయాలి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై అధ్యయనాలు జరిగేందుకు అంతర్జాతీయంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ, చట్టాల్లో కీలకమైన మార్పులు తీసుకురావాలి.

అంతేకాదు వాటిని నూటికి నూరు శాతం అమలయ్యేవిధంగా చూడాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహళా సాధికారత, అభివృద్ధిపై అధ్యయనాలు చేసి, మూల్యాంకనం చేయాలి. అన్ని దేశాల్లో చట్టాలను పటిష్టం చేయాలి. స్త్రీ సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం కేంద్రం, రాష్ట్రాలు, అంతర్జాతీయం గా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

అప్పుడే అంతర్జాతీయస్థాయిలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేటువంటి అవకాశంతో పాటు వారికి రక్షణ కూడా ఉంటుంది.

ఇదంతా కేవలం దేశప్రభుత్వాల బాధ్యతే కాదు, తల్లిదండ్రులు, సమాజం బాధ్యత కూడా ఉంటుందనే చెప్పాలి. 1975 సంవత్సరంలో యుఎన్‌ఒ స్త్రీల సమస్యలను చర్చించడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఏ దేశానికి, ఏ జాతికి చెందిన స్త్రీలు అయినా అణచివేతకు గురవుతున్న స్త్రీల సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరగాలని ఆ సమా వేశం ముఖ్య ఉద్దేశం. 1975 లోనే మార్చి 8వ తేదీని అంత ర్జాతీయ మహిళా దినోత్స వంగా ప్రకటించింది. 1910 మార్చి 8న డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఒక అంతర్జాతీ య మహిళా సభ జరిగింది.

జర్మన్‌ కమ్యూనిస్టు నాయకు రాలు క్లారా జట్కిన్‌ ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్స వం జరపాలని చేసిన సూచన అంగీకరించబడింది.

  • శ్రీనివాస్‌ పర్వతాల

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com