ములుగు జిల్లా ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంట‌ర్!

ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం

encounter in Mulugu District Agency
encounter

తెలంగాణ ములుగు జిల్లా ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు జ‌రిగిన‌ట్టు సమాచారం. వెంకటాపురంమండలంలోని స‌రిహ‌ద్దు ప్రాంతంలోని క‌ర్రిగుట్టల వద్ద ఈ ఎన్ కౌంటర్ జ‌రిగిన‌ట్టు ప్రాథ‌మికంగా స‌మాచారం . కాగా, ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/