ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

maoists
maoists

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 30 గంటల నుంచి ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని తొండమార్కా, దుర్మా, జడేకదేవాల్‌ అటవీప్రాంతంలో భద్రతాబలగాలు 30గంటలపాటు ఆపరేషన్‌ ప్రహార్‌ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి మావోలకు చెందిన ఆయుధాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/