ముద్ర రుణాలతో పెరగనున్న ఉపాధి

 mudra
mudra

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణాలు అందితే దాని ప్రయోజనం, ఫలితాలు ఏవిధంగా ఉంటాయో మరోసారి రుజువైంది. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింది జారీచేస్తున్న ముద్రా రుణాల వల్ల ఎంతో మంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అధికారిక సర్వే ద్వారా ముద్ర రుణాల ద్వారా ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయనేది వెల్లడైంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ముద్రా రుణాలు పొందడానికి ముందు వ్యాపార సంస్థలు దాదాపు 3.93కోట్ల మందికి ఉపాధిని కల్పించాయి. అయితే ముద్రా రుణాలు పొందిన తర్వాత వీటి ఉద్యోగాల కల్పన 5.04కోట్లకు చేరుకుంది. అంటే వృద్ధి 28శాతంగా ఉంది. 2015 ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఎలాంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా లక్షలాది మంది స్వయం ఉపాధిని పొందగలిగారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/sports/