పొరుగు సేవల పద్ధతిలో ఉద్యోగావకాశం

జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి వారి కార్యాలయం, గుంటూరు

Data Entry operator posts
Data Entry operator posts

వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరియు సంచాలకులు , ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌, విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారం మరియు కలెక్టర్‌ మరియు జిల్లా మేజిస్ట్రేల్‌ గుంటూరు వారి అనుమతితో 21 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలను పొరుగు సేవల పద్ధతిన ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ గుంటూరు నందు భర్తీ చేయుటకు గానూ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, గుంటూరు వారు ఆహ్వానించటమైనది..

ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ఏకమొత్తమున రూ.15,000లు వేతనంగా చెల్లించబడును..

పైన తెలుపబడిన ఉద్యోగము భర్తీకి సంబంధించిన ప్రకటన, దరఖాస్తు ఫారం మరియు తప్పనిసరిగా దరఖాస్త ఫారంతో జతపరచవలసిన ధ్రువపత్రములు వివరములు http://guntur.ap.gov.in నందు పొందుపరచటమైనది.

అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, గుంటూరు వారి కార్యాలయం ప్రాంగణమునందు గల జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి వారి కార్యాలయము, గుంటూరు వారికి రిజిస్టర్‌పోస్టు అక్నాలెడ్జిమెంట్‌ జతపరిచి తేదీ.27.7.2020 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే స్వీకరించబడును.

తదుపరి ఎలాంటి దరఖాస్తులను స్వీకరించబడవు.. అసంపూర్తి దరఖాస్తులు మరియు అసంపూర్తి ధ్రువపత్రములు సమర్పించిన దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడవు..

ఇట్లు: సం. ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఐఎఎస్‌, కలెక్టర్‌ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌, గుంటూరు

జిల్లా ఆసుపత్రలు సమన్వయాధికారి,
ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌, గుంటూరు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/