రిటైర్మెంట్ వయసు పెంపు పై ఉద్యోగులలో హర్షాతిరేకం

kcr
kcr

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు పదోన్నతులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కెసిఆర్ నిర్ణయించడంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీంతోపాటు పదోన్నతులకు సంబంధించి కోర్టు కేసులను వెనక్కి తీసుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సిఎం చేసిన విజ్ఞప్తికి ఉద్యోగులు సైతం స్పందిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. చా లాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సిఎం కెసిఆర్ సమాయత్తం కావడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2014 టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవీ విరమణ వయస్సు పెంపుపై ఉద్యోగులు ఆశలు పెంచుకున్నారు.
కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,35,400 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, 35,598 నా లుగవ తరగతి ఉద్యోగులు, గెజిటెడ్‌లుగా 19,3 63 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరు కాక ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకొని వారు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వయస్సు పెంపుతో వీరికి లబ్ధిచేకూరుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరు రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉండడంతో సిఎం కెసిఆర్ తీసుకునే నిర్ణయంపై వారు ఆశలు పెంచుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/