తండ్రి డీఎస్ మరణం పట్ల.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ ట్వీట్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల ఆయన తనయుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ ట్వీట్ చేసారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా, తండ్రి డీఎస్ మృతి పట్ల కొడుకు, ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇకలేరు.. ఐ విల్ మిస్ యూ డాడీ! నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు..’ అని బరువెక్కిన గుండెతో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు తండ్రి డీఎస్‌తో ఉన్న తన ఫొటోను ఎంపీ అర్వింద్ షేర్ చేసారు.

అన్నా..అంటే నేనున్నా అని,ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు

I WILL MISS YOU DADDY

నా తండ్రి,నా గురువు అన్నీ నాన్నే!
ఎదురొడ్డు, పోరాడు,భయపడకు అని నేర్పింది నాన్నే

ప్రజలను ప్రేమించు,ప్రజల కొరకే జీవించు అని చెప్పింది నాన్నే

నాన్నా..!
నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు,నాలోనే ఉంటావు pic.twitter.com/ZO7Skf4fi4
— Arvind Dharmapuri (@Arvindharmapuri) June 29, 2024