జే తాళ్ళూరికి దుబాయ్‌లో ఘనంగా సత్కరం

jay-talluri
jay-talluri

దుబాయ్‌ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జే తాళ్ళూరిని దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ఘనంగా సత్కరించింది. కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్‌ వచ్చిన జే తాళ్ళూరిని ఇటిసిఎ సభ్యులు ఆహ్వానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు తానా లాంటి పెద్ద సంస్థకు అధ్య్ష బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న జే తాళ్ళూరిలాంటి వాళ్ళను సత్కరించడం తమకు లభించిన అదృష్టమని చెప్పారు. జే తాళ్ళూరి మాట్లాడుతూ, అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి, మాతృరాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి తానా తరపున అందిస్తున్న సేవా కార్యక్రమాలను అందరికీ వివరించారు. అమెరికాలో తానా అతి పెద్ద తెలుగు సంఘమని చెబుతూ, నాలుగు దశాబ్దాలకుపైగా కమ్యూనిటీకి తానా ఎన్నో సేవలను చేస్తోందని తెలియజేశారు. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాలకు మార్గదర్శిగా కూడా తానా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ప్రముఖులు, సభ్యులు ఘనంగా సత్కరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/