వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ

ఎఫ్‌బిఐ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం

Emergency in Washington
Emergency in Washington

Washington: అమెరికా అధ్యక్షుడిగా  ఈ నెల 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ట్రంప్ అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఎమర్జెన్సీ విధించారు.

వాషింగ్టన్ లో  ఘర్షణలు చోటుచేసుకోనున్నాయన్న ఎఫ్‌బిఐ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ విధించారు.

బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర్‌ మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

రాజధానిలోని క్యాపిటల్‌ భవనంతో సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ఎఫ్‌బిఐ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌ ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/