Email To The Editor

ఎడిట్‌ పేజీకి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు పంపగోరేవారు ఈ కింది ఈ మెయిల్‌ [email protected] కు పంపగలరు

letter to editor
Email To The Editor

ప్రజావాక్కు

గ్రామాలలో పగలే వెన్నెల: కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట, జయశంకర్‌జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలలో రాత్రిపూట మాత్రమే వెల గాల్సిన విద్యుత్‌ దీపాలు పగలు కూడా వెలగడంతో విద్యుత్‌ శాఖకి తీవ్రనష్టం కలుగుతుంది. ప్రతిగ్రామంలోని కరెంట్‌పోల్స్‌కి ఒక విద్యుత్‌ బల్బ్‌ని బిగించారు. వాటికి ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్వి చ్చులు ఏర్పాటు చేయకపోవడంతో నిరంతరం లైట్లు వెలుగు తున్నాయి. అధిక వేడిమివల్ల కొన్ని బల్బులు పాడైపోతున్నాయి. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, జూనియర్‌ లైన్‌మెన్‌ల అవ గాహనరాహిత్యం పగలే వెన్నెలగా మారుతుంది. అక్రమ విద్యు త్‌ వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తూ కరెంటు బిల్లులు కట్టనివారికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తూ కరెంటును పొదు పుగా వాడుకోవాలని చైతన్యం తేవాల్సిన విద్యుత్‌ అధికారులకు 24 గంటల వెలుగుల గూర్చి తెలియదా? ఎంత విద్యుత్‌ దుర్వి నియోగం అవ్ఞతుందో తెలియదా? మండల స్థాయిలో ఏఇలు ,ఎడిఇలు నిరంతరం విద్యుత్‌ వాడకంపై సమీక్షలు నిర్వహిస్తూ విద్యుత్‌ బిల్లులు వసూలుచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సర్పం చ్‌లకు ఈ తతంగం తెలిసినా వారు పట్టించుకోరు. ఇకనైనా విద్యుత్‌ శాఖ అధికారులు మేల్కొనాలి.

తగ్గుతున్న కంప్యూటర్‌ తరగతులు: జి.అశోక్‌, గోదూర్‌ జగిత్యాల జిల్లా

కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగంలో తెలంగాణ దేశంలోకెల్లా అగ్రగామి కాగల సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థికి కంప్యూటర్‌ పరిజ్ఞానం, డిజిటల్‌ నాలెడ్జ్‌ అనివార్యమైన రోజులు ఇవి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో చిన్న క్లాసులు నుంచే కంప్యూటర్‌ విద్యలో శిక్షణ ఇస్తున్నారు.ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులు ఈ విద్యకు దూరమవ్ఞతున్నారు. గతంలో నిట్‌ కంప్యూ టర్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హైస్కూల్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ తరగతులు నిర్వహించారు. దాన్ని ఎందుకు నిలిపి వేశారో అర్థం కావడం లేదు. ఇకనుంచైనా కనీసం ఆరో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్‌ తరగతు లు నిర్వహించాలి. లేకుంటే వీరు ఇతరుల కంటే వెనుకబడిపో తారు. వీరికి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి.

పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరచాలి : సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

ప్రపంచంలో ఎన్నో దేశాలు పర్యాటక రంగంపైనే ఆధారపడు తున్నాయి.పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ఆయా కేంద్రాలను అభివృద్ధిపరచడం ద్వారా పర్యాటకులను ఆకర్షించి ఎంతో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. అయితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పర్యాటక రంగం పూర్తి గా నిర్లక్ష్యానికి గురైంది. గతంలో ఎన్నో చారిత్రక నిర్మాణాలు, కోటలు, దేవాలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆయా రాజుల కాలంలో నిర్మింపబడి నిరంతరం అభివృద్ధిచెందుతూ ఉండేవి. కాలక్రమేణా ప్రభుత్వాల నిరాదరణ, నిర్లక్ష్యవైఖరి కారణంగా శిధిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ప్రదేశాలను గుర్తించి తక్షణం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది

అవినీతిని రూపుమాపాలి: : వులాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశంజిల్ల్లా

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు మన పెద్దలు. ఈనానుడి మన రాజకీయ నాయకులకు చక్కగా సరిపోతుంది. ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్‌ ఇండియా అని ప్రకటించగానే పలువురు ముఖ్యమంత్రులు ఎవరికివారు తాము టెక్నాలజీ వినియోగంలో ముందు ఉన్నాం అంటే తాము ముందు ఉన్నామని పోటీలు పడుతున్నారు.అంతేతప్ప తాము అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకు ప్రజలకు మేలుచేస్తాయి అనే విషయాన్ని మరిచిపోతున్నా రు. ప్రస్తుతం పట్టిపీడిస్తున్న సమస్యలలో అతి ముఖ్యమైనది అవినీతి. ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం అవినీతి. ఎవరు అధికారంలోకి వచ్చినా మొదట చెప్పేది అవినీతిని నిరోధిస్తామని. అవినీతి అనే మహావృక్షానికి వేరు వంటి వారు రాజకీయ నాయ కులు కాగా కొమ్మలు వంటి వారు అధికారులు. అవినీతి అనే మహావృక్షాన్ని కూకటివేళ్లతో పెకళించాలి అంటే రాజకీయనాయ కుల అవినీతిని నిరోధించాలి.అవినీతి నిరోధానికి ఎటువంటి చర్య లు తీసుకోకుండా మన పాలకులు అవినీతిని అంతమొందిస్తామని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. గతంలో కంటే ప్రస్తుత రోజుల్లో అవినీతి మరింత ఎక్కువైంది. అంతమొందించటం సాధ్యంకాదు.

ర్యాగింగ్‌ను అరికట్టాలి: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్‌ భూతం తిరిగి విజృంభిస్తోంది. ర్యాగింగ్‌ అరికడతామని ఆమాత్యులు చేసే ప్రకటనలు ఆచరణలో విఫలమవ్ఞతున్నాయి. పరిమితర్యాగింగ్‌కు సాక్షాత్తు కళాశాల యాజమాన్యం అధ్యాపక వర్గం అనుమతించడం ఒక వైపరీత్యం. ఇటీవల ఒక ప్రొఫెసర్‌ వేధింపులను భరించలేక పి.జి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అధ్యాపకుల లైంగిక వేధింపులు ఎక్కువ అవ్ఞతున్నాయి. ఇక సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌ పేరిట అమానుషంగా హింసించే సంఘటనలు అనేకం.పోలీసులు కూడా ఆయా సందర్భాల్లో తూతూ మంత్రం చందాన నామమాత్రంగా కేసులు పెట్టి వదిలేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ర్యా గింగ్‌ పేరిట వేధింపులకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు విధించాలి. ఉపాధ్యాయులైతే సర్వీస్‌ రిజిష్టర్లలో ప్రత్యేకంగా రిమార్కులు రాయాలి. ర్యాగింగ్‌ అన్ని పరిమితులు దాటి శారీరక, మానసిక హింసలకు దారితీయడం అమానుషం.

ఆక్రమణలను తొలగించాలి: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణలో భాగంగా ఆ రహదా రులుపోయే అనేక గ్రామాలు, మండల కేంద్రాలలోనూ ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రాంతాలలో సర్వీసు రోడ్లు నిర్మించారు. బాగానే ఉంది. అయితే ఈ సర్వీసు రోడ్లను వ్యాపారస్థులు, కార్లు, లారీలు, బండ్లు తదితర వాహనదారులు ఆక్రమిస్తున్నారు. దీనితో ఈ సర్వీసు రోడ్లు మరింత ఇరుకుగా తయారై ట్రాఫిక్‌ జామ్‌అవ్ఞతుంది. వాహనాల పార్కింగ్‌కు అను మతి ఇవ్వకూడదు. ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలి.